ఏపీ ప్రాజెక్టులపై సుప్రీంకోర్టుకు TG సర్కార్

ఏపీ ప్రాజెక్టులపై సుప్రీంకోర్టుకు TG సర్కార్

TG: ఏపీ ప్రభుత్వం చేపడుతున్న లింక్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో అభ్యంతరాలు తెలపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుపై అభ్యంతరాలు తెలపనుంది. సుప్రీంలో వాదనలు వినిపించేందుకు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీని సంప్రదించినట్లు తెలుస్తోంది. కాగా, ఇటీవల TG ప్రభుత్వ ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాసిన విషయం తెలిసిందే.