ప్రజావాణి ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలి: కలెక్టర్

ప్రజావాణి ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలి: కలెక్టర్

వనపర్తి జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర ఆర్డీఓతో కలిసి ప్రజల నుంచి అర్జీలు,వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులు, అర్జీలను వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.