VIDEO: మ్యాజిక్ డ్రైన్లను పరిశీలించిన డిప్యూటీ సీఎం
ELR: ద్వారక తిరుమల మండలం ఐ.ఎస్.జగన్నాథపురంలో వినూత్నంగా ఏర్పాటు చేసిన మ్యాజిక్ డ్రైన్లను ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వాటి వల్ల కలిగే ప్రయోజనాలను సంబంధిత అధికారులు ఆయనకు వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, కలెక్టర్ వెట్రీసెల్వి, మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.