లబ్ధిదారులకు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపీణీ

HYD: శంషాబాద్ మున్సిపల్ మండల కార్యాలయంలో 53 మంది లబ్ధిదారులకు 53 లక్షల 6 వేల నూట నలభై ఎనిమిది రూపాయల షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ బుధవారం పంపిణీ చెశారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ సుష్మా మహేందర్ రెడ్డి, తాసీల్దార్ రవీందర్ దత్ పాల్గొన్నారు.