గుండెపోటుతో మాజీ కార్పొరేటర్​ మృతి

గుండెపోటుతో మాజీ కార్పొరేటర్​ మృతి

నిజామాబాద్ నగరానికి చెందిన బీజేపీ నాయకుడు, మాజీ కార్పొరేటర్​ పంచరెడ్డి సురేష్ (42)​ మృతి చెందారు. బుధవారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించినట్లు సమాచారం. కాగా.. పంచరెడ్డి సురేష్​ భార్య అనిత 16వ డివిజన్​ కార్పొరేటర్​గా గెలుపొందిన విషయం తెలిసిందే.