ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల ఆకస్మిక తనిఖీ
కృష్ణా: బాపులపాడు మండలం కానుమోలు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలను ఆయుష్ డైరెక్టర్ దినేష్ కుమార్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యశాలకు సరఫరా అయిన మందుల నాణ్యతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక గ్రామస్తులతో మాట్లాడి, ఆసుపత్రి అవసరాలను తెలుసుకున్నారు. అదనపు సిబ్బంది నియామకం విషయంలో పూర్తి సహకారం అందిస్తామని దినేష్ కుమార్ హామీ ఇచ్చారు.