VIDEO: గ్యాస్ సెగ.. చిరువ్యాపారుల ఆందోళన
NLG: దేవరకొండ పట్టణంలోని హోటల్స్, టీ స్టాల్స్, ఫాస్ట్ ఫుడ్, దోశ బండి వ్యాపారులు గత నెల రోజులుగా కమర్షియల్ సిలిండర్ల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్‌లో సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో గత్యంతరం లేక డొమెస్టిక్ సిలిండర్లు వాడుతుంటే సివిల్ సప్లై అధికారులు వాటిని సీజ్ చేసి ఫైన్లు వేస్తున్నారని ఆదివారం వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు.