మంత్రి చొరవతో డ్రైనేజీ కాలువ పనులు ప్రారంభం

మంత్రి చొరవతో డ్రైనేజీ కాలువ పనులు ప్రారంభం

సత్యసాయి: పెనుకొండ పట్టణంలోని పరిటాల రవీంద్ర సర్కిల్‌లో డ్రైనేజీ మెయిన్ కాలువ సరిగా లేకపోవడం వల్ల స్థానిక ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను టీడీపీ నాయకులు మంత్రి సవిత దృష్టికి తీసుకెళ్లగా.. స్పందించి రూ. 4.50 లక్షలు మంజూరు చేశారు. దీంతో పెనుకొండ టీడీపీ పట్టణ అధ్యక్షుడు శ్రీరాములు ఆధ్వర్యంలో గురువారం డ్రైనేజీ పనులు ప్రారంభించారు.