'ఉపాధి శిక్షణను యువత సద్వినియోగం చేసుకోవాలి'
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రంగంపల్లిలో మంగళవారం యూనియన్ బ్యాంక్ (ఆర్ఎస్ఈటీఐ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థను జిల్లా కలెక్టర్ కోయ హర్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతీ, యువకులు ఈ సంస్థ ద్వారా అందిస్తున్న కోర్సులలో శిక్షణ పొంది, స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.