BREAKING: నోటిఫికేషన్ విడుదల
TG: రాష్ట్రంలో 66 సివిల్ జడ్జీల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు డిసెంబర్ 8 నుంచి 29వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో హైకోర్టు దరఖాస్తులు ఆహ్వానించనుంది. పరీక్ష తేదీలు, సమయం, హాల్‌టికెట్ల డౌన్‌లోడ్, కంప్యూటర్ ఆధారిత పరీక్షకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని త్వరలోనే అధికారులు వెబ్‌సైట్‌లో ఉంచనున్నారు.