జిల్లాలో 388 బస్సుల్లో.. ఉచిత ప్రయాణం

TPT: రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 'స్త్రీశక్తి' ప్రారంభం కానుండటంతో జిల్లాలో ఆర్టీసీ అధికారులు సన్నద్ధమయ్యారు. జిల్లాలోని చిత్తూరు ఒకటి, రెండో డిపో, పలమనేరు, పుంగనూరు, కుప్పం పరిధిలోని ఐదు డిపోల్లో ఉన్న 461 బస్సుల్లో 84 శాతం ఇందుకు కేటాయించారు. వీటిలో 21 బడి బస్సు సర్వీసులను నడపనున్నారు.