పేదల సొంతింటి కలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే

SRPT: పేదల సొంతింటి కలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే సామేలు అన్నారు. సోమవారం మద్దిరాల మండలం కుక్కడంలో ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గు పోసే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు.