VIDEO: ఎరువులు కోసం బారులు తీరిన రైతులు

SKLM: నందిగం మండలం దేవుపురం గ్రామ సచివాలయం వద్ద శనివారం ఎరువుల కోసం రైతులు బారులు తీరారు. నందిగం మండలంలో వ్యవసాయశాఖ అధికారులు పరువేక్షణ లోపం కారణంగా గంటల తరబడి క్యూ లైన్ లో ఉన్నప్పటికీ ఎరువులు పూర్తిస్థాయిలో దొరకలేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో బోరుభధ్ర, దేవుపురం పంచాయతీ పరిధిలోని గ్రామాల రైతులు ఇబ్బందులు పడుతున్నారు.