కానిస్టేబుల్ పాత్ర కీలకం: SP
CTR: ప్రజా భద్రత కోసం నూతనంగా ఎంపికైన కానిస్టేబుళ్లు అహర్నిశలు పనిచేయాలని SP తుషార్ డూడీ సూచించారు. విజయవాడలో నియామక పత్రాలు స్వీకరించనున్న 196 మంది అభ్యర్థులతో జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో సోమవారం ఆయన సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో మీరు చేసే కృషి మీదే శాంతి భద్రతల నిర్వహణ ఆధారపడి ఉంటుందని వారికి సూచించారు. ప్రతి అంశంలోనూ కానిస్టేబుల్ పాత్ర కీలకమన్నారు.