ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

KMR: బిక్కనూర్ మండలంలో విషాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జంగంపల్లి గ్రామానికి చెందిన సైదుగారి శ్రావణ్ (36) మద్యానికి బానిసగా మారి, ఎలాంటి పని చేయకుండా జులాయిగా తిరుగుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై ఆంజనేయులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.