ఈ రహదారిలో ప్రయాణం.. ప్రమాదకరం

KKD: రౌతులపూడి మండలంలోని రాజవరం నుంచి దిగువశివాడ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఈ రోడ్డు మరింత ఛిద్రమయ్యింది. ఒక్కోచోట అసలు రోడ్డెక్కడుందో వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. గుంతలు, బురద కారణంగా అదుపు తప్పి ప్రమాదాలకు గురవుతున్నామని వాహన చోదకులు ఆవేదన చెందుతున్నారు. రోడ్డు నిర్మించాలని కోరుతున్నారు.