'ప్లాస్టిక్ రహిత సమాజమే లక్ష్యం'
అనకాపల్లి: ప్లాస్టిక్ రహిత సమాజమే లక్ష్యంగా పనిచేయాలని ఎస్పీ తుహీన్ సిన్హా సూచించారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయం ప్రాంగణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించి చీపురు పట్టి శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ యంత్రాంగం శాంతి భద్రతల పరిరక్షణలోనే కాకుండా సామాజిక సేవ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలన్నారు.