భగత్‌సింగ్ స్ఫూర్తితో పోరాటాలు నిర్వహించాలి: PDSU
WGL: నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో PDSU ఆధ్వర్యంలో భగత్‌సింగ్, రాజగురు, సుఖదేవ్‌ల 95వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. జిల్లా అధ్యక్షుడు గుర్రం అజయ్ మాట్లాడుతూ.. వారి పోరాట స్ఫూర్తితో విద్యార్థులు ప్రజాస్వామ్య పరిరక్షణకు ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. నూతన విద్యా విధానం రద్దు వరకు పోరాటాలు నిర్వహించాలని అన్నారు.