'ప్రతి చోట మొక్కలు నాటాలి'

NLG: ఖాళీగా ఉన్న ప్రతి చోట మొక్కలు నాటవలసిన అవసరం ఉందని జిల్లా అటవీ శాఖ అధికారి రాజశేఖర్ అన్నారు. ఆర్డీవో అశోక్ రెడ్డి, సామాజిక కార్యకర్త సురేష్ గుప్తాతో కలిసి ఆయన ఆర్డీవో కార్యాలయ ఆవరణలో మంగళవారం పలు రకాల మొక్కలను నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ.. నీటి సంరక్షణ చర్యలతో పాటు ఆవరణలో విరివిగా మొక్కలను నాటుతున్నామని తెలిపారు.