కేసీ కాల్వకు తాగునీరు విడుదల

KRNL: గూడూరు మండలంలోని సుంకేసుల ప్రాజెక్టు నుంచి కేసీ కాల్వకు తాగునీటిని విడుదల చేసినట్లు డ్యామ్ జేఈ రాజు ఆదివారం పేర్కొన్నారు. కర్నూలు నగర ప్రజల తాగునీటి అవసరాల నిమిత్తం సుంకేసుల ప్రాజెక్టు నుంచి కేసీ కాల్వ ద్వారా 1930 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. డ్యామ్‌లో ప్రస్తుతం 1.235 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు వెల్లడించారు.