'వడదెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'
కర్నూలు: ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన తాగునీరు, మజ్జిగ పంపిణీ చలివేంద్రంను కలెక్టర్ ప్రారంభించారు. ఎండల నేపథ్యంలో వడదెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.