ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ప్రచారం
AKP: అచ్యుతాపురం మండలం దొప్పర్లలోని ఎంపీపీ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల చేరికల కోసం సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడి అమ్మ ఒడి, ఉచిత దుస్తులు, బూట్లు, పుస్తకాలు, మధ్యాహ్న భోజన పథకం వంటి ప్రభుత్వ సదుపాయాలను వివరించారు. గ్రామంలో పాఠశాల కొనసాగాలంటే పిల్లలను ప్రభుత్వ స్కూల్లో చేర్పించాలని కోరారు.