అలర్ట్.. కృష్ణా జిల్లాకు వర్ష సూచన

అలర్ట్.. కృష్ణా జిల్లాకు వర్ష సూచన

కృష్ణా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లాలో మంగళవారం మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని సంస్థ పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైతే తప్పితే బయటకు రావద్దని తెలిపింది.