VIDEO: కొత్తగూడలో జెండా ఆవిష్కరించిన తహసీల్దార్

MHBD: కొత్తగూడ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మండల తహసీల్దార్ రాజు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎందరో త్యాగ ఫలితం నేటి స్వాతంత్య్ర భారతదేశమాని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.