ఘనంగా సదర్ ఉత్సవాలు

ఘనంగా సదర్ ఉత్సవాలు

VKB: దీపావళి పండగ అనంతరం యాదవులు సదర్ పండుగను ఘనంగా జరుపుకుంటారు. సోమవారం దౌల్తాబాద్ మండల కేంద్రంలో యువకులు, ఉత్సాహభరితమైన డప్పుల మోతకు నృత్యం చేశారు. రంగురంగుల పూలతో అలంకరించిన ఎద్దులను ముందుంచి ఊరేగింపులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి కోట్ల హన్మంతు తదితరులు పాల్గొన్నారు.