అంగనవాడి కేంద్రం ఆకస్మిక తనిఖీ

అంగనవాడి కేంద్రం ఆకస్మిక తనిఖీ

భద్రగిరిలో అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ నిశాంత ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిన్నారుల అభ్యసన తీరును గమనించారు. పిల్లల బరువు, ఎత్తు స్వయంగా పరిశీలించారు. పిల్లల బరువు, ఎత్తు, అభ్యసన స్థాయిని నిరంతరం పరిశీలించాలని అంగన్‌వాడీ టీచర్‌కి ఆదేశించారు. చిన్నారులు ఆరోగ్యంగా ఉండేలా చూడలని సూచించారు.