జిల్లాకు భారీ వర్ష సూచన
కాకినాడ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా వేటకు వెళ్లే మత్స్యకారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అలాగే, వాతావరణ మార్పుతో పంటలపై ప్రభావం పడే ఛాన్స్ ఉండడంతో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.