వేసవి స్పెషల్: 34 ప్రత్యేక రైళ్లు

వేసవి స్పెషల్: 34 ప్రత్యేక రైళ్లు

KKD: వేసవి రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ 34 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు సామర్లకోట స్టేషన్ సూపరింటెండెంట్ రమేశ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కాకినాడ పోర్ట్ నుంచి రాజమండ్రి వెళ్లే వారి కోసం ఈ రైలు అందుబాటులో ఉంటుందన్నారు. రైళ్ల వివరాల కోసం ప్రయాణికులు సమీప స్టేషన్లలో సంప్రదించాలని సూచించారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.