నేడు నారాయణస్వామి ఆలయ శంకుస్థాపన

నేడు నారాయణస్వామి ఆలయ శంకుస్థాపన

ప్రకాశం: కొమరోలు సమీపంలో గల పెట్రోల్ బంక్ ఎదురుగా ఇవాళ శ్రీ మిట్టపాలెం నారాయణస్వామి నూతన దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహిస్తున్నట్లు భక్త బృందం సభ్యులు తెలిపారు. ఉదయం 10 గంటలకు భూమిపూజ నిర్వహించారు. ఈ మేరకు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. కాగా, ఈ ఆలయ నిర్మాణం వేగవంతంగా పూర్తిచేయనున్నట్లు భక్తులు తెలిపారు.