ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే
అన్నమయ్య: మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే షాజహాన్ భాష ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలోనీ వార్డులను ఆయన పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వార్డులు, మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలోని స్థానిక నాయకులు, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.