మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు
MBNR: బాలానగర్ మండలంలోని పెద్దరేవల్లి గ్రామానికి చెందిన కుమార్(34)కు గత రెండు నెలల క్రితం పెరాలసిస్ వ్యాధి సోకింది. అప్పటి నుంచి మతిస్థిమితం కోల్పోయాడు. ఈ నెల 5వ తేదీన ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాడు. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. గురువారం పీస్ లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసినట్లు ఎస్సై లెనిన్ తెలిపారు.