'నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం'
SRCL: వేములవాడ మండలం మారుపాకలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు "నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం" కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రైతులకు నాణ్యమైన వరి, పెసర విత్తనాలను పంపిణీ చేశామని పేర్కొన్నారు. నాణ్యమైన విత్తనాలు వాడడం ద్వారా రైతులు మంచి దిగుబడి పొందవచ్చని వివరించారు.