గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న ఆర్టీసీ ఛైర్మన్

ASR: వినాయక చవితి ఉత్సవాలు అరకులోయలో ఘనంగా జరుగుతున్నాయి. అరకులోయ గణేష్ కమిటీ మెయిన్ రోడ్డులో పెట్టిన గోపిక గణేష్ ప్రతిమ ఆకట్టుకుంది. గోపిక గణేష్‌ను ఆర్టీసీ విజయనగరం జోన్ ఛైర్మన్ దొన్నుదొర దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. విఘ్నాలు తొలగించే గణేషుని ఆశీస్సులు అందరిపై ఉండాలని దొన్నుదొర కోరారు. పెదలబుడు సర్పంచ్ దాసుబాబు, జనసేన ఇంఛార్జ్ చిరంజీవి ఉన్నారు.