తోటపల్లి కాలువ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
PPM: సీతానగరం మండలం లక్ష్మీపురం గ్రామ సమీపంలో తోటపల్లి కాలువ పనులను మంగళవారం ఎమ్మెల్యే విజయ్ చంద్ర పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడి, పనులపై ఆరా తీశారు. అలాగే నదుల అనుసంధానం, నీరు కాలువలో ఎక్కువైనప్పుడు కాలువ నీరు సువర్ణముఖి నది వెళ్ళడానికి కాలువ ఏర్పాటు చేశారు. పొలంలోకి వెళ్ళడానికి వంతెన కావాలని రైతులు ఎమ్మెల్యేను కోరారు.