28న ఉచిత మెగా వైద్య శిబిరం

KDP: ఈ నెల 28వ తేదీన సిద్ధవటంలోని సరోజినీ క్లినిక్ నందు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తున్నట్లు డాక్టర్ వై.ప్రమోద తెలిపారు. మాతృశ్రీ IVF క్లినిక్ ఆధ్వర్యంలో ఈ శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వైద్య శిబిరంలో మహిళలకు సంబంధించి అన్ని రకాల వ్యాధులకు పరీక్షలు ఉంటాయన్నారు. ప్రజలు ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.