VIDEO: ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
ASF: కాగజ్ నగర్ గాంధీచౌక్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. మున్సిపల్ ఛైర్ పర్సన్ షాహిన్ సుల్తానా, వైస్ ఛైర్ పర్సన్ డాక్టర్ అనిత కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మహిళా సాధికారత, సమాజంలో వారి పాత్ర గురించి ఈ సందర్భంగా ప్రసంగించారు. వివిధ రంగాల్లో విశేష సేవలందిస్తున్న మహిళలను శాలువాలతో ఘనంగా సన్మానించారు.