కుక్కల దాడి.. బాలుడిని పరామర్శించిన ఎమ్మెల్యే
BHNG: భువనగిరి పట్టణంలో వీధి కుక్కల దాడిలో మూడేళ్ల బాలుడు ప్రియాన్ష్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఇవాళ HYDలోని ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో MLA కుంభం అనిల్ కుమార్ రెడ్డి బాలుడిని పరార్శించారు. ప్రస్తుతం బాలుడు క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. త్వరలో కృత్రిమ కన్ను అమర్చనున్నట్లు పేర్కొన్నారు. ఇది చాలా బాధాకరమని, కుక్కల సమస్యపై అసెంబ్లీలో కూడా చర్చించినట్లు చెప్పారు.