నేడు మంగళగిరిలో జాతీయ చేనేత దినోత్సవం

నేడు మంగళగిరిలో జాతీయ చేనేత దినోత్సవం

గుంటూరు జిల్లా మంగళగిరి వేదికగా ప్రభుత్వం గురువారం 11వ జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించనుంది. దీనికి ముఖ్యఅతిథిగా సీఎం చంద్రబాబు హాజరుకానున్నట్లు చేనేత, జౌళిశాఖ మంత్రి సవిత వెల్లడించారు. ఈ సభా వేదిక నుంచి చేనేతలకు ఇచ్చిన మూడు కీలకమైన హామీలు ఉచిత విద్యుత్తు, జీఎస్టీ అమలు, త్రిఫ్ట్ ఫండ్ పథకాన్ని సీఎం అమల్లోకి తీసుకురానున్నారని పేర్కొన్నారు.