ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజుపై ఫిర్యాదు

కోనసీమ: భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఫ్లెక్సీని చించేసిన ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజుపై రాజోలు సర్కిల్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం రాజోలు మండల మాలల న్యాయ పోరాట సమితి జేఏసీ నాయకులు ఫిర్యాదు చేసారు. కుల మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్న రఘురామరాజును వెంటనే ఎమ్మెల్యే పదవీ నుండి బర్తరఫ్ చేయ్యాలన్నారు.