పర్వతగిరిలో మొదటిరోజు ఎన్ని నామినేషన్ అంటే..?
WGL: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల మొదటి రోజున పర్వతగిరి మండల వ్యాప్తంగా సర్పంచ్ పదవులకు 34, వార్డు సభ్యులకు 24 నామినేషన్లు దాఖలయ్యాయి. మండలంలో ఏర్పాటు చేసిన తొమ్మిది కేంద్రాల్లో మధ్యాహ్నం తర్వాత ప్రక్రియ ఊపందుకుంది. ఇంకా మరికొందరు అభ్యర్థులు రిటర్నింగ్ అధికారుల వద్ద నుంచి పత్రాలు తీసుకుని నామినేషన్లు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు.