రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి: తహసీల్దార్

కృష్ణా: ఘంటసాల మండలంలో ఈనెల 16వ తేదీ నుంచి సెప్టెంబర్ 18వ తేదీ వరకు జరిగే రెవిన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల తహసీల్దార్ బి. విజయప్రసాద్ పేర్కొన్నారు. ఘంటసాలలోని తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బంది, విఆర్వోలు, గ్రామ సర్వేయర్‌లతో రెవిన్యూ సదస్సులు ఏర్పాట్లు, రెవిన్యూ సమస్యలపై సమీక్ష నిర్వహించి, సూచనలు చేశారు.