త్రిపురాంతకంలో రోడ్డు ప్రమాదం

ప్రకాశం: త్రిపురాంతకం మండలం గుట్లపల్లి వద్ద జాతీయ రహదారిపై గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కట్టెల ట్రాక్టర్‌ను వెనుక నుంచి కారు ఢీకొనడంతో కారులోని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందానట్లు స్థానికులు తెలిపారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడగా, వారిని వినుకొండ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.