పేకాట ఆడుతున్న ముగ్గురు అరెస్ట్
ప్రకాశం: సంతనూతలపాడు మండలం లక్ష్మీపురం వద్ద జూదం ఆడుతున్న ముగ్గురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి, వారి నుంచి రూ. 22, 060 నగదును స్వాధీన పరుచుకున్నారు. అనంతరం వారిని సంతనూతలపాడు పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు.