'జన్మాష్టమి వేడుకలు నిర్వహణలో జాగ్రత్తలు పాటించాలి'

'జన్మాష్టమి వేడుకలు నిర్వహణలో జాగ్రత్తలు పాటించాలి'

SKLM: హిరమండలం మండలంలోని కూర్మ వైదిక గ్రామంను కొత్తూరు సీఐ చింతాడ ప్రసాదరావు, హిరమండలం ఎస్సై ఎండీ యాసిన్ సందర్శించారు. ఈనెల 16, 17 తేదీల్లో నిర్వహించనున్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలని ఆశ్రమ నిర్వాహకులకు సూచించారు. ఇటీవల ఆశ్రమంలో జరిగిన అగ్నిప్రమాదం దృష్టిలో పెట్టుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.