రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

MHBD: గూడూరు మండలం బొద్దుగొండ గ్రామ శివారులో బుధవారం రోడు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొట్టడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో చర్లపల్లి గ్రామానికి చెందిన రామయ్య మృతి చెందారు. గూడూరు నుంచి మహబూబాబాద్ వైపు వెళ్తున్న నాగరాజు అతివేగంగా బైకును నడిపి రామయ్య వాహనానికి ఢీ కొట్టినట్లు ఎస్సై గిరిధర్ రెడ్డి వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునమన్నారు.