ముందుచూపుతోనే బయటపడ్డాం: సీఎం రమేష్
AP: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందుచూపుతో 'మొంథా' తుఫాన్ నుంచి చాలా తక్కువ నష్టంతో బయటపడ్డామని ఎంపీ సీఎం రమేష్ అన్నారు. మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, కుటుంబ సభ్యులతో కలిసి ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకొని మాట్లాడారు. ఎక్కడిక్కడ అధికారులను అప్రమత్తం చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారన్నారు. అంతకుముందు ఆయన శ్రీవారికి తలనీలాలు సమర్పించారు.