ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన DSO
నెల్లూరు జిల్లాలోని మనుబోలు మండలంలో జిల్లా పౌర సరఫరాల అధికారిణి బి. లీలారాణి, సహాయ పౌర సరఫరాల అధికారి శ్రీ లక్ష్మినారాయణ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మనుబోలులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసి, బద్దేవోలు పిడూరువారిపాలెంలో ధాన్యం రాశులను పరిశీలించారు. అనంతరం పీపీసీ ఇంఛార్జ్ మహేష్‌కు గన్ని బ్యాగులు, బ్యాంకు గ్యారెంటీలకు సంబంధించి సూచనలు అందించారు.