క్రీడా పోటీలను ప్రారంభించిన ఎంపీడీవో

క్రీడా పోటీలను ప్రారంభించిన ఎంపీడీవో

NLR: దుత్తలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ఎంపీడీవో ఎల్. చెంచమ్మ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిత్యం విద్యా బోధనతో బిజీగా ఉండే ఉపాధ్యాయులకు ఆటవిడుపుగా ఈ పోటీలు ప్రారంభించామని అన్నారు. ఈ పోటీలు మండల, డివిజన్, జిల్లా రాష్ట్ర స్థాయిల్లో నాలుగు దశల్లో జరుగుతాయని అన్నారు.