VIDEO: మానవత్వం చాటుకున్న అమ్మ ఫౌండేషన్ సభ్యులు
JN: జనగామలో అమ్మ ఫౌండేషన్ సభ్యులు మానవత్వం చాటుకున్నారు. పట్టణ కేంద్రంలో మతిస్థిమితం లేని వ్యక్తి అటు ఇటు తిరుగుతూ ఉండేవాడు. బాగా ఇటీవల అతని కాలుకు దెబ్బ తాకడంతో ఒకే దగ్గర ఉంటూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. విషయం తెలుసుకున్న ఫౌండేషన్ బాధ్యులు నేడు ఆయనకు ప్రథమ చికిత్స అందించి, బట్టలు వేసి, భోజనం అందించి మానవత్వం చాటుకున్నారు.