50కిపైగా గ్రామాల ప్రజలను తరలించండి: ఇజ్రాయెల్
లెబనాన్‌ను హెజ్‌బొల్లా నాశనం చేస్తోందని ఇజ్రాయెల్ ఆరోపించింది. దానిని నివారించడానికి ఉగ్రసంస్థలోని కీలక నేతలను లక్ష్యంగా దాడులు చేపట్టినట్లు వెల్లడించింది. హెబ్‌బొల్లా స్థావరాలపై మరిన్ని దాడులు చేయనున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో బెకా లోయలో ఉన్న 50కి పైగా గ్రామాల ప్రజలను ఇళ్ల నుంచి ఖాళీ చేయించాలని సూచించింది. వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరింది.